WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Baby movie 2nd Week collections: ‘బేబి’ 2 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మరో మైల్ స్టోన్ అందుకున్న చిన్న సినిమా..

Baby Movie 14 Days Box Office Collections: ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబి (Baby). ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. SKN నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్న ఈ సినిమా నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకుంది.

Baby Movie 2 Weeks Box Office Collections: ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబి (Baby). ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. SKN నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్న ఈ సినిమా నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకుంది

విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. రెండు వారాలైన ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తూనే ఉంది.  ఈ సినిమా 14వ రోజు  గురు వారం మంచి వర్షంలోను బాక్సాఫీస్ గగ్గర మంచి వసూళ్ల వర్షం కురిపించడం విశేషం.

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరో కీలకపాత్రలో నటించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. జూలై 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది

ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులు కూడా ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. ఇక బేబి మూవీ విషయానికి వస్తే.. విడుదలకు ముందే.. బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ నటనతో అదరగొట్టారు. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. స్కూల్ లో చిగురించిన ప్రేమ, ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. కాలేజీకి వెళ్లాక ఎలా మారుతుందనే సన్నివేశాలతో సినిమాను అల్లుకున్నారు. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలోను అదరగొడుతోంది.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. చిన్న సినిమాగా వచ్చిన ఈ బేబీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టే ఆస్కారం ఉంది. విడుదలకు ముందే సాలిడ్ బజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డే అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి వారం రూ. 20.46 కోట్లు.. రెండో వారం బాక్సాఫీస్ దగ్గర రూ. 11.78 కోట్ల షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్‌గా రన్ అవుతోంది.  ఈ రోజు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ రాకతో ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.

ఇక ఈ సినిమా 14 రోజుల బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లలో  రూ. 2.12 కోట్ల షేర్ (రూ. 4.20 గ్రాస్) వసూళ్లను రాబట్టడం విశేషం.  ఓవరాల్‌గా వారం రోజుల్లో తెలుగు స్టేట్స్‌లో   కలిపి రూ. 32.24 కోట్ల షేర్ (రూ. 58.60 కోట్ల గ్రాస్)ని ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. వరల్డ్ వైడ్‌గా  రూ. 36.55 కోట్ల షేర్ (రూ. 68.75 కోట్ల గ్రాస్)వసూళ్లతో వర్షంలోను వసూళ్ల వర్షం కురిపించడం మాములు విషయం కాదు. 

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 15.41 కోట్ల రేంజ్‌లో షేర్ అందుకుంది. ఓవరాల్‌గా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని నాల్గో రోజు కూడా దుమ్ము దులిపింది. ఇప్పటి వరకు ఈ సినిమా  రూ. 28.55 కోట్ల ఫ్రాఫిట్‌తో కొన్ని బయ్యర్స్‌కు మూడింతలకు పైగా లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు ఈ యేడాది టాలీవుడ్‌లో  15వ క్లీన్ హిట్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఆహా విడుదలైన ఆరు వారాలకు అంటే ఆగస్టులో స్ట్రీమింగ్‌కు తీసుకురానుంది. ఈ సినిమా ఒకేసారి ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైష్ణవి (వైష్ణవి చైతన్య) తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను 10 క్లాస్ నుంచే ప్రేమిస్తూ ఉంటోంది. మొదట వైష్ణవి ప్రేమించిన తర్వాత ఆనంద్ కూడా వైష్ణవి ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో ఆనంద్ టెన్త్ ఫెయిలై ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు.

మరోవైపు వైష్ణవి ఇంజనీరింగ్‌లో జాయిన్ అవుతోంది. అక్కడ వైష్ణవికి విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయమవుతాడు. ఈ క్రమంలో వీళ్ల జీవితంలో జరిగిన పరిణామాలు ఏమిటనేది బేబి మూవీ ప్రధాన స్టోరీ. ప్రాక్టికల్‌గా బయట జరిగిన.. జరగుతున్న వాటినే సినిమాలో చూపించాడు దర్శకుడు

మధ్య తరగతి అమ్మాయిలు ఇతరులు ఇచ్చే విలువైన బహుమతులకు ఆశపడటం. ఎలా తమ జీవితాలను నాశనం చేసుకోవడం.. మరోవైపు హై క్లాస్ అమ్మాయిలు కూడా ఎలా చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారనేది ఈ సినిమాలో చర్చించాడు. మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అనే కాన్సెప్ట్‌ను తెరపై చూపించాడు

ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన వైష్ణవి.. తన పాత్రలో ఒదిగిపోయింది. విరాజ్ అశ్విన్ కూడా ఉన్నంతలో పర్వాలేదనపించాడు. ఇతర పాత్రల్లో నాగబాబు, లిరిష, వైవా హర్ష తదితరులు నటించారు. 

Credit : https://telugu.news18.com/photogallery/movies/baby-movie-2nd-week-box-office-collections-another-record-break-by-this-movies-ta-2004362-page-12.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *