WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Samsung Galaxy Watch 6: శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 6 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అయితే సూపర్.. ధర ఎంతంటే..

Samsung Galaxy Watch 6: దక్షిణ కొరియాలో నిన్న జరిగిన ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2023’ ఈవెంట్‌లో శామ్‌సంగ్ వివిధ రకాల ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గెలాక్సీ వాచ్ 6 (Galaxy Watch 6) స్మార్ట్‌వాచ్‌లను కూడా అన్‌వీల్ చేసింది.

దక్షిణ కొరియాలో నిన్న జరిగిన ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2023’ ఈవెంట్‌లో శామ్‌సంగ్ వివిధ రకాల ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు, గెలాక్సీ ట్యాబ్‌ S9 సిరీస్, గెలాక్సీ బడ్స్2 ప్రో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వంటి ప్రీమియం ప్రొడక్ట్స్‌ను కంపెనీ ఆవిష్కరించింది. టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గెలాక్సీ వాచ్ 6 (Galaxy Watch 6) స్మార్ట్‌వాచ్‌లను కూడా అన్‌వీల్ చేసింది. జులై 26 నుంచి వీటి కోసం ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి ఆగస్టు 11 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ వాచ్ 6 స్మార్ట్‌వాచ్‌లు గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ అనే రెండు వేరియంట్లలో వస్తాయి.

గెలాక్సీ వాచ్ 6 ఒక బేస్ మోడల్ కాగా గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్‌ ప్రీమియం డిజైన్‌తో వచ్చే ప్రీమియం మోడల్. ఈ రెండూ కొత్త డిజైన్, మరింత శక్తివంతమైన ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తాయి. బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, స్లీప్ అప్నియా ట్రాకర్‌తో సహా అనేక హెల్త్ ఫీచర్లను కూడా అందిస్తాయి. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉంటాయి. రెండు వాచ్‌ల స్టాండర్డ్ వెర్షన్ సఫైయర్ (Sapphire) క్రిస్టల్‌తో 1.3-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్లు 1.5-అంగుళాల డిస్‌ప్లేను ఆఫర్ చేస్తాయి. ఈసారి ప్రో మోడల్ వాచ్ లాంచ్ కాకపోవడం గమనార్హం.

సైజులు, కలర్లు

గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌లో యూజర్లు Wi-Fi-only లేదా LTE-ఎనేబుల్డ్‌ వెర్షన్లను ఎంచుకోవచ్చు. బేస్ గెలాక్సీ వాచ్ 6 మోడల్ 40mm, 44mm సైజు వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 43mm, 47mm సైజులలో వస్తుంది. గెలాక్సీ వాచ్ 6 40mm వేరియంట్ గ్రాఫైట్ & సిల్వర్ కలర్‌ ఆప్షన్స్‌లో రానుండగా, 40mm వేరియంట్ గ్రాఫైట్, గోల్డ్‌ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 43mm, 47mm రెండు వేరియంట్లు సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటాయి.

ధరలు

శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 6 ధర 299 డాలర్ల (దాదాపు రూ.24,500) నుంచి ప్రారంభమవుతుంది. గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ ధర 399 (దాదాపు రూ. 32,700) డాలర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు ఇండియాలో ఎప్పుడు అందుబాటులో ఉంటాయో శామ్‌సంగ్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5 ఫోన్లు లాంచ్.. ధర, ఆఫర్లు, ఫీచర్ల వివరాలు..

* ఫీచర్లు

రెండు స్మార్ట్‌వాచ్‌లు దాదాపు ఒకే రకమైన ఫీచర్లతో వస్తాయి. కానీ వాటి డిజైన్లు భిన్నంగా ఉంటాయి. గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ రొటేటింగ్ బెజెల్స్‌ను తిరిగి తీసుకొచ్చింది. ఈ వాచ్ 6 క్లాసిక్‌ రొటేటింగ్ బెజెల్స్, లెదర్ స్ట్రాప్‌తో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. మరోవైపు, వాచ్ 6 స్పోర్టీ లుక్‌తో క్యాజువల్ లేదా సెమీ-ఫార్మల్ ఔట్‌ఫిట్స్‌కి మ్యాచింగ్‌గా నిలుస్తుంది. ఈ రెండు వాచ్‌లు గూగుల్ WearOS 4, శామ్‌సంగ్ One UI 5 వాచ్ ఆధారంగా పనిచేస్తాయి. Android 10 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ ఐఫోన్లకు మద్దతు ఇవ్వవు.

రెండు వాచ్‌లు ఫాల్ డిటెక్షన్‌తో వస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు లేదా మరెక్కడైనా పడిపోయినట్లు డిటెక్ట్ చేస్తే అవి ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ కాల్స్‌ చేస్తాయి. నిద్రలో కూడా గుండె ఆరోగ్యాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి BP, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ మానిటరింగ్ ఆఫర్ చేస్తాయి. ఈ సరికొత్త వాచ్‌లు స్లీప్ కోచింగ్, ECG, బయోయాక్టివ్ సెన్సార్‌ని ఉపయోగించి హార్ట్ బీట్ మానిటరింగ్‌తో సహా స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లపై కూడా ఫోకస్ పెడతాయి.

Credit : https://telugu.news18.com/news/technology/samsung-launches-galaxy-watch-6-series-check-specifications-price-and-all-other-details-gh-srd-2000470.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *