WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Pawan Kalyan Disaster Movies: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్టర్ మూవీస్.. జానీ, పంజా, పులి సహా చిత్రాల జాబితా ఇదే..

Pawan Kalyan Disaster Movies: పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసినా.. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కెరీర్‌లో టాప్ చిత్రాలే కాదు.. అట్టర్ ఫ్లాప్ అయిన డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో స్పీడ్ బ్రేకర్‌లా మారిన ఆ రాడ్ రంబోలా మూవీస్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..

Pawan Kalyan Disaster Movies: పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసినా.. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కెరీర్‌లో టాప్ చిత్రాలే కాదు.. అట్టర్ ఫ్లాప్ అయిన డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో స్పీడ్ బ్రేకర్‌లా మారిన ఆ రాడ్ రంబోలా మూవీస్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..

అజ్ఞాతవాసి | పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. జల్సా, అత్తారింటికీ దారేది తర్వాత వీళ్ల కలయికలో వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకోవడంతో దారుణంగా విఫలమైంది

కాటమరాయుడు | పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాటమరాయుడు’. ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వీరం’ మూవీకి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

సర్ధార్ గబ్బర్ సింగ్ | పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మరో మూవీ ‘సర్థార్ గబ్బర్ సింగ్’. బాబీ (కేయస్ రవీంద్ర) దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

పంజా | పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పంజా’. ఈ సినిమా బాక్పాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

తీన్‌మార్ | పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘తీన్‌మార్’. సైఫ్ అలీ ఖాన్ హీరోగా ‘లవ్ ఆజ్ కల్’ మూవీకి రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. 

కొమరం పులి | ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్.జె.సూర్య కలయికలో వచ్చిన చిత్రం ‘కొమరం పులి’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు

బంగారం | పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బంగారం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

బాలు | తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు కరుణాకరణ్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘బాలు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

గుడుంబా శంకర్ | పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు నిర్మాతగా తల్లి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది

జాని (Johnny) : ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్వీయ దర్వకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మించిన సినిమా ‘జానీ’. ఈ మూవీ అందరి అంచనాలు తలకిందలు చేస్తూ అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. హీరోగా పవన్ కళ్యాణ్‌కు తొలి డిజాస్టర్ మూవీ ఇదే కావడం గమనార్హం

Credit : https://telugu.news18.com/photogallery/movies/pawan-kalyan-bro-fame-top-disaster-movies-list-from-komaram-puli-johnny-panja-gudumba-shankar-here-are-the-list-ta-1957136-page-11.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *