WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు నిర్మాత అరెస్ట్

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం, సినిమా వాళ్లపై డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ నటులపై డ్రగ్స్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కావడం చూసే ఉన్నాం. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులను ఈడీ విచారించడం చూశాం. ఈ నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.

తాజాగా ఓ డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని (Kp Chowdary) పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో కేబి.చౌదరికి సంబంధం ఉందని అరోపణలతో అతని పై నిఘా పెట్టి అరెస్ట్ చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ ఇష్యూలో ఇంకా ఎవరైనా సినీ నటుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

గతంలోనూ టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్లతో పాటు హీరోలు, హీరోయిన్ లు, నిర్మాతలు కూడా విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసులో విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది.

Credit : https://telugu.news18.com/news/movies/kabali-producer-arrested-in-drugs-case-slb-1894088.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *