WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

హైదరాబాద్‌లో మూడో షోరూమ్ ప్రారంభించిన తెలంగాణ ఈవీ స్టార్టప్

ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, డెవలప్‌మెంట్, తయారీలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ 3వ అత్యాధునిక షోరూమ్‌ను ప్రారంభించింది. ఇంపాక్ట్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో డీలర్‌షిప్ పేరుతో మూసాపేట్‌లో

ఈ షోరూమ్‌లో కస్టమర్లు క్వాంటమ్ ఎనర్జీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. క్వాంటమ్ ఎనర్జీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇక్కడ లభిస్తాయి. సందర్శకులు ప్రతి మోడల్ తయారైన తీరు, పనితీరు, నిర్మాణ నాణ్యతను పరిశీలించవచ్చు. హైదరాబాద్‌లో షోరూమ్ ప్రారంభంతో, క్వాంటమ్ ఎనర్జీకి ఇప్పుడు తెలంగాణలో ఇంపాక్ట్ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా మొత్తం నాలుగు డీలర్‌షిప్‌లు ఉన్నాయి

 క్వాంటమ్ ఎనర్జీ నుంచి ప్లాస్మా, ఎలెక్ట్రాన్, మిలన్, బిజినెస్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా వీటిని రూపొందించింది కంపెనీ. ప్లాస్మా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1500W మోటార్ ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 135 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ధర వెల్లడించాల్సి ఉంది.

హైదరాబాద్‌లో మా సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ విస్తరణ జీరో ఎమిషన్ ట్రాన్స్‌పోర్టేషన్ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబించడమే కాకుండా పర్యావరణ అనుకూల మొబిలిటీ ఆప్షన్స్ అందించడంపై మా అంకితభావాన్ని కూడా సూచిస్తుంది. హైదరాబాద్‌లో మా షోరూమ్ నెట్‌వర్క్ విస్తరణ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం. మార్కెట్‌లో మా బలమైన స్థానాన్ని నొక్కి చెబుతోంది. ప్రతి కొత్త షోరూమ్‌తో, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు మా నిబద్ధతను మేము బలోపేతం చేస్తాము.
కుషాల్ సీ, డైరెక్టర్, క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్

Credit : https://telugu.news18.com/photogallery/technology/telangana-based-electric-vehicle-startup-quantum-energy-opens-its-3rd-showroom-in-hyderabad-ss-1911048-page-7.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *