WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Rangabali Movie Review: ‘రంగబలి’ మూవీ రివ్యూ.. నాగశౌర్య బ్యాక్ బౌన్స్ అయ్యాడా.. ?

Rangabali Movie Review: నాగ శౌర్య గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ‘ఛలో’ తర్వాత సరైన సక్సెస్ లేదు. ఈ నేపథ్యంలో ‘రంగబలి’ అంటూ కొత్త సినిమాతో పలకరించాడు. ఈ మూవీతో నాగ శౌర్య హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

రివ్యూ : రంగబలి (Rangabali)

నటీనటులు : నాగశౌర్య, యుక్తి తరేజా,షైన్ టామ్ చాకో,శరత్ కుమార్,మురళీ శర్మ, సత్య,బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి

సంగీతం: పవన్ సిహెచ్

నిర్మాత : సుధాకర్ చెరుకూరి

దర్శకత్వం: పవన్ బాసంశెట్టి

విడుదల తేది : 7/7/2023

నాగశౌర్య రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలను కాకుండా కాస్త డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ తర్వాత ఇతనికి ఆ రేంజ్ హిట్ మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలో పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ‘రంగబలి’ మూవీ చేసాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్టు అందుకున్నాడా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

రంగబలి’ ఏపీలోని రాజవరంలో ఓ సెంటర్‌కు పేరు. హీరో శౌర్య (నాగశౌర్య)కు ఆ ఊరు అంటే సెంటిమెంట్. మొసలికి నీటిలోనే బలం ఉన్నట్టు.. హీరోకు కూడా  పుట్టి పెరిగిన ఊరులోనే ఉంటేనే తనకు అందరు గుర్తిస్తారని భావిస్తాడు.  ఈ నేపథ్యంలో విశాఖలోని ఓ మెడికల్ కాలేజీలో సహజ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత హీరోయిన్ తన ప్రేమను తన తండ్రికి (మురళీ శర్మ) కు చెబుతోంది.  వీరి పెళ్లికి మొదట ఒప్పుకున్న హీరోయిన్ ఫాదర్.. అతనిది రంగబలి ఉండే ఊరు అని తెలుసుకొని .. ఆ ఊరు విడిచిపెట్టి విశాఖకు వచ్చేయమంటాడు. దీనికి హీరో ఒప్పుకోడు. ఇంతకీ హీరో, హీరోయిన్ల ప్రేమకు అడ్డుగా మారిన రంగబలి సెంటర్‌కు ఆ పేరు ఎందుకొచ్చింది. హీరోయిన్ ఫాదర్ వీరి పెళ్లికి అడ్డుగా నిలిచిన రంగబలి సెంటర్ పేరు వెనక ఉన్న కహాని ఏమిటనేదే మిగతా  సినిమా స్టోరీ.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే.. 

దర్శకుడు పవన్ బాసింశెట్టి ‘రంగబలి’ సినిమ ా కథను ‘ఛలో’ సినిమాను ప్రేరణగా తీసుకొని దాన్ని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసాడు. ఫస్టాఫ్ మొత్తంగా హీరో (నాగశౌర్య) క్యారెక్టరైజేషన్‌‌, ఎలివేషన్ సీన్స్‌తో  పాటు సత్య కామెడీని నమ్ముకున్నాడు. మధ్య హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్‌తో మంచిగానే లాక్కొచ్చాడు. అటు తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం.. చెడు తిరిగుళ్లు తిరిగే కొడుకుపై కోప్పడే తండ్రి పాత్ర అంతా బాగానే ఉంది. ముఖ్యంగా సత్య క్యారెక్టర్‌ను ఇతరులు సంతోషంగా ఉండే ఓర్వలేని తనం కామన్‌గా మనలో చాల ా మందికి ఉంటుంది. అది కనెక్ట్‌ అయ్యేలా ఈ పాత్రను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంది.

అటు మెడికల్ కాలేజీలో సత్యతో ఇతర పాత్రలతో చేయించిన కామెడీ వరకు అంతా బాగానే అనిపించినా.. ఇంటర్వెల్ వరకు కథ సరైన గాడిన పడదు. ఇంటర్వెల్ తర్వాత రంగబలి సెంటర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది. దానికి హీరోకు ఉన్న సంబంధాన్ని సెకండాఫ్‌లో చెప్పినా.. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు. ఈ సినిమాకు పనిచేసిన ఇతర టెక్నికల్ టీమ్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు పదను పెడితే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే.. 

నాగశౌర్య ఓ మధ్య తరగతి యువకుడి పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించాడు. ముఖ్యంగా తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో అతని నటన ఆకట్టుకుంది. హీరోయిన్ యుక్తి తరేజా.. చూసేందకు పద్ధతిగా కనిపించినా.. పాటల్లో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. పాటల్లో లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించింది. దసరా తర్వాత షైన్ టామ్ చాకో ఈ సినిమాలో విలన్‌గా స్టైలిష్‌గా కనిపించాడు. సత్య ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సినిమాను తన కామెడీతో నిలబెట్టాడనే చెప్పాలి. ఇక చివర్లో సప్తగిరి.. అతిగా చేసే జర్నలిస్ట్ పాత్రలో నవ్వించాడు. ఇక మురళీ శర్మ.. అతిథి పాత్రలో నటించిన శరత్ కుమార్, శుభలేక సుధాకర్ తమ పరిధి మేరకు మెప్పించారు. ఎడిటర్.. ఇంటర్వె‌ల్‌కు ముందు.. సెకండాఫ్‌లో తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ 

కథ

ఫస్టాఫ్ కామెడీ

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ 

సెకండాఫ్

కనెక్ట్ కానీ  ఫ్లాష్ బ్యాక్

ఎడిటింగ్

చివరి మాట.. రంగబలి.. అక్కడక్కడ ఆకట్టుకునే కామెడీ ఎమోషనల్ డ్రామా..

Credit : https://telugu.news18.com/news/movies/rangabali-movie-review-rating-and-public-talk-naga-shourya-will-back-bounce-ta-1950740.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *