WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Multibagger: లక్షకు రూ. 2.3 లక్షలు.. ఏడాదిలోనే ఇంత లాభమా? ఇన్వెస్టర్ల దశ తిప్పిన స్టాక్ ఇదే!

Multibagger: ప్రస్తుత రోజుల్లో తక్కువ సమయంలో ఎక్కువ లాభం రావాలని కోరుకుంటున్న వారే ఎక్కువగా ఉంటుంన్నారు. అలాంటి వారు రిస్క్ తీసుకున్నట్లయితే అది సాధ్యపడొచ్చు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని గుర్తించి పెట్టుబడి పెడితే హైరిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి ఓ స్టాక్ ఏడాదిలోనే లక్షను రూ. 2.3 లక్షలు చేసింది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Multibagger: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అంటే హైరిస్క్ ఉంటుంది. అదే స్థాయిలో హైరిటర్న్స్ కూడా ఉంటాయి. కానీ, చాలా సందర్భాల్లో నష్టాలు సైతం వస్తుంటాయి. మార్కెట్లపై సరైన అవగాహన కలిగి ఉండి, నిపుణుల సలహాలు తీసుకుంటూ పెట్టుబడులు పెడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. మార్కెట్లలో ఇన్వెస్టర్లను తక్కువ సమయంలోనే మిలియనీర్లను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉంటాయి. అలాంటి ఓ స్టాక్ ఏడాదిలోనే ఇన్వెస్టర్ల దశ తిప్పింది. లక్ష పెట్టిన వారికి రూ. 2.3 లక్షలు రిటర్న్స్ అందించింది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అదే ఎన్‌సీసీ లిమిటెడ్ (NCC Limited). గడిచిన ఏడాది కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. జులై 13, 2022 రోజున ఈ కంపెనీ స్టాక్ రూ. 58.20 వద్ద ఉండగా ఇప్పుడు జులై 12, 2023 రోజున రూ. 138.85 స్థాయికి చేరింది. మొత్తంగా 130 శాతం మేర పెరిగింది. అంటే ఇందులో ఏడాది క్రితం రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆ స్టాక్ విలువ రూ. 2.30 లక్షలుగా ఉంటుంది.

ఇటీవలే ఎన్‌సీసీ లిమిటెడ్ కంపెనీ జూన్, 2023లో మొత్తం రూ.2,055 కోట్ల ఆర్డర్ అందుకుంది. ఈ రెండింటిలో బిల్డింగ్ డివిజన్‌ కోసం రూ. 1335 కోట్లు, ఎలక్ట్రికల్ డివిజన్ ఆర్డర్ రూ. 720 కోట్లుగా ఉంది. గత ఆర్థిక ఏడాది క్యూ4 ఫలితాల్లో కంపెనీ రెవెన్యూ 42.32 శాతం పెరిగి రూ. 4949.03 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ. 496.94 కోట్లుగా ఉంది. కంపెనీ పీఏటీ రూ. 197.14 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇవాళ ఈ స్టాక్ రూ. 135.60 వద్ద ప్రారంభమైంది.

Credit : https://telugu.samayam.com/business/share-market/civil-construction-company-ncc-limited-delivered-120-percent-returns-in-a-year/articleshow/101720958.cms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *