WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Electric Bike: సరికొత్త ఎలక్ట్రికల్ బైక్..! ఒకసారి ఛార్జింగ్ పెడితే.. 20 కి.మీ వెళ్లచ్చు..! మడత బెట్టేయొచ్చు కూడా..!

ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వెంటపడుతున్నాయి. ఐతే ఓ పెద్దాయన మాత్రం తానే సొంతగా ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేసుకున్నాడు.

ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వెంటపడుతున్నాయి. ఐతే ఓ పెద్దాయన మాత్రం తానే సొంతగా ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట పట్టణానికి చెందిన మంతెన సత్యనారాయణ.. గత 30ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ షాపు నడుపుతున్నాడు. ఆయన వయసు 66ఏళ్లు. వయసు మీదపడటంతో ఎక్కువ దూరం నడవలేక బైక్ తీసుకుందామని భావించాడు. అయితే వయసురీత్యా బరువైన బండిని హ్యాండిల్ చేయలేనమో అని ఆలోచించి.. తానే తేలిగ్గా ఉండే ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసుకుందామని భావంచాడు.

అనుకున్నదే తడవుగా తనకున్న పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేసుకున్నాడు. సొంతగానే డిజైన్ చేసుకొని బైక్ కు రెండు బ్యాటరీలు అమర్చాడు. దీనికోసం మొత్తం రూ.18000 ఖర్చు చేశాడు. ప్రస్తుతం రయ్ రయ్ మంటూ రోడ్లపై రైడ్ చేస్తున్నాడు. సత్యనారాయణ తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్.. బడా కంపెనీల బైకులకు సైతం పోటీనిస్తోంది.

మూడు గంటలపాటు ఛార్జింగ్ పెడితే 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని సత్యనారాయణ తెలిపారు. అంతేకాదు ఈ బైక్ చాలా లైట్ వెయిట్ ఉంటుందట.. ముఖ్యంగా మహిళలకు చక్కగా సరిపోతుందని వివరించారు. పిల్లలను స్కూల్లో డ్రాప్ చేసేందుకు, మార్కెట్ కు వెళ్లి కూరగాయలు, సరుకులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ బైక్ పార్కింగ్లో పెట్టినప్పుడు బయటకు కూడా తీయడానికి సులువుగా ఉంటుందని దీనికి రివర్స్ గేర్ కూడా ఉందని అలానే ఈ బైక్ మధ్యకి పోల్డ్ చేసుకొని లగేజీ లా ట్రావెల్ కూడా చేయవచ్చని మంతెన సత్యనారాయణ తెలియజేశారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా చాలా తయారు చేస్తానని తెలియజేశారు. జగ్గయ్యపేట పట్టణంలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ చూసేందుకు స్థానికులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.

ఇలాంటి వాహనాలు వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలుపుతున్నారు. అదే విధంగా అతి తక్కువ ఖర్చుతో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందని అదేవిధంగా పట్టణంలో చిన్న చిన్న సందుల్లో తిరగటానికి కూడా వీలుగా ఉంటుందని పట్టణంలోని దుకాణాలకు వెళ్లేందుకు అక్కడ పార్కింగ్ చేసేందుకు కూడా చాలా తక్కువ స్థలం ఆక్రమిస్తుందని అదే విధంగా ఇంట్లో కూడా పార్కింగ్లా చేసేందుకు తక్కువ స్థలమే పడుతుందని సత్యనారాయణ తెలిపాడు.

రానున్న రోజుల్లో ఇది పర్యావరణానికి కాలుష్యానికి కారణం కాకుండా ఉంటుందని ఇప్పటికే జగ్గయ్యపేట పట్టణంలో ఎక్కువ కాలుష్యం అయి దానితో పాటుగా జగ్గయ్యపేటలో తిరిగే వాహనాలతో వచ్చే కాలుష్యం మరి ఎక్కువ అయిపోతుందని ఆరోగ్యరీత్యా అత్యవసర నిత్యా ఇలాంటి వాహనాలు ఉపయోగించడం ఎంతో ఉపయోగకరమని మన ఆరోగ్యాన్ని మనం ఎంతో కొంత కాపాడుకోవడానికి ఉపయోగపడతాయని స్థానికులు తెలుపుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో వాహనం తయారు చేసినందుకు సత్యనారాయణ పట్టణవాసులు అభినందిస్తున్నారు

Credit : https://telugu.news18.com/news/technology/old-man-designed-new-electric-bike-this-low-cost-full-details-here-jsw-tvk-prn-1963856.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *