WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

రాహుల్ సిప్లిగంజ్ మెమొరీస్ మ్యూజిక్ వీడియో.. హీరోగా చేస్తూనే సుధాకర్ కొమాకుల డేర్ స్టెప్  

Rahul Sipligunj: లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో పాటు పలు సినిమాల్లో నటించి నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన సుధాకర్ కొమాకుల.. ఇప్పుడు వినూత్న అడుగేశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన మెమొరీస్ మ్యూజిక్ వీడియోతో రాబోతున్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో పాటు పలు సినిమాల్లో నటించి నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన సుధాకర్ కొమాకుల (Sudhakar Komakula).. ఇప్పుడు వినూత్న అడుగేశారు. నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ‘మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నాడు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో ‘మెమొరీస్’ వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు.

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనే చూపించనున్నారు.

ఈ పాటని వరుణ్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ లో సింపుల్ హుక్ స్టెప్ చోడోచ్చు. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. సుధాకర్ కొమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందట. ఈ సాంగ్ లోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటూ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుంది. త్వరలో గ్రాండ్ గా ఈ మ్యూజిక్ వీడియో రిలీజ్ కాబోతోంది.

Credit : https://telugu.news18.com/news/movies/sudhakar-komakula-ready-with-rahul-sipligunj-music-video-slb-1975782.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *