WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Balakrishna – Rajamouli: బాలకృష్ణ,రాజమౌళి కాంబినేషన్ ఎందుకు వర్కౌట్ కాలేదు.. అసలు కారణం ఇదే..

Balakrishna – Rajamouli : తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఇక మాస్ పల్స్ తెలిసిన రాజమౌళి గతంలో ఒక కోసం పనిచేయాలనుకున్నారు. కానీ  కట్ చేస్తే ఆ కాంబినేషన్ కుదరలేదు. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఇక మాస్ పల్స్ తెలిసిన రాజమౌళి గతంలో ఒక కోసం పనిచేయాలనుకున్నారు. కానీ  కట్ చేస్తే ఆ కాంబినేషన్ కుదరలేదు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో రాజమౌళి నెంబర్ డైరెక్టర్‌గా సత్తా చాటుతున్నాడు. ఐతే.. రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 తర్వాత ‘సింహాద్రి’ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు

ఐతే.. రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 తర్వాత ‘సింహాద్రి’ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. హీరోగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాలో సింగమలై ‌గా ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు పట్టం కట్టారు.ఐతే ముందుగా ఈ కథ రాజమౌళి..బాలకృష్ణకు వినిపించాడట. ఆయన ఈ కథను విని సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఇందుకు గల కారణాన్ని ప్రముఖ సినీ రచయత పరుచూరి గోపాలకృష్ణ పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా.

సింహాద్రి’ సినిమా నేరుము – శిక్ష కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.  గతంలో  బాలకృష్ణ చేసిన ‘సమరసింహారెడ్డి’, ‘వంశానికొక్కడు’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ వంటి సినిమాలను నేరము – శిక్ష కాన్సెప్ట్‌తో తెరకెక్కాయి. ఆయా సినిమాలు బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి.

ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ రాసిన ‘సింహాద్రి’ కథ బాలకృష్ణకు వద్దకు వస్తే..ఈ స్క్రీన్ ప్లే థియరీలో ఇప్పటికే సినిమాలు తీశాం కదా. వద్దులే అంటూ ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించారట బాలయ్య. ఆ తర్వాత అదే కథను రాజమౌళి.. ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమా చేయడం అది ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఇక బాలయ్య అదే టైమ్‌లో ’సింహాద్రి’ కాకుండా ‘పలనాటి బ్రహ్మనాయుడు’ కథ నచ్చడంతో బి.గోపాల్ దర్శకత్వంలో ఆ సినిమా చేశారు. ఆ సినిమాకు పరుచూరి బ్రదర్స్ డైలాగులు రాసారు.

ఒకవేళ ఈ  సినిమాను బాలకృష్ణ ఒప్పుకొని ఉంటే, అప్పట్లోనే బాలయ్య,రాజమౌళి కాంబినేషన్‌ను ప్రేక్షకులు చూసి ఉండేవారు.  అయితే సింహాద్రి, సింగమలైగా ఎన్టీఆర్ ఆ పాత్రలో అదరగొట్టేశారు. 

అంతేకాదు ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు హీరోగా ఎనలేని పేరు వచ్చింది. ఈ సినిమాకు కీరవాణి పాటలు స్పెషల్ అట్రాక్షన్. 2003లో వచ్చిన ‘సింహాద్రి’ అప్పటి వరకు అన్ని ఇండస్ట్రీ రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. ఈ సినిమా ఎక్కువ కేంద్రాల్లో 175 రోజులుకు పైగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది

బాలకృష్ణ (మగధీర) ఇక రాజమౌళి.. రామ్ చరణ్‌తో తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాను ముందుగా బాలకృష్ణతో తెరకెక్కించాలనుకున్నట్టు అన్‌స్టాపబుల్‌ షోలో వెల్లడించారు. కానీ బాలయ్య ఈ కథపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమాను రామ్ చరణ్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఇండస్ట్రీగా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే కదా.

మొత్తంగా రాజమౌళి.. బాలయ్యతో రెండు సార్లు సినిమా తెరకెక్కించాలని చూసినా.. వర్కౌట్ కాలేదు.ఏది ఏమైనా రాజమౌళి, బాలయ్యతో సినిమా తెరకెక్కిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. 

Credit : https://telugu.news18.com/photogallery/movies/balakrishna-rajamouli-why-balakrishna-and-rajamouli-combination-didnot-work-out-this-is-the-real-reason-behind-ta-1988080-page-8.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *