WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Suriya : సూర్య పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి..

Suriya : తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. ఆయన లేటెస్ట్‌గా కంగువ అంటూ వస్తున్నారు. సూర్య బర్త్ డే సందర్భంగా ఈరోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. అయితు సూర్య బర్త్ డే వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు అభిమానులు మృతి చెందారు.

తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక సూర్య లేటెస్ట్‌గా కంగువ (Kanguva) అంటూ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. ఈ సినిమా టీజర్ (Kanguva Teaser) తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అబ్బురపరిచే విజువల్స్‌‌తో అదరగొట్టింది కంగువ టీజర్. సూర్య లుక్, ఆ బ్యాగ్రౌండ్ కేక పెట్టిస్తోంది. విజువల్స్‌తో థ్రిల్ చేస్తోంది. ఇక అది అలా ఉంటే సూర్య ఈరోజు తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్య పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే గ్రీటింగ్ చెప్పే ఫ్లెక్సీ బ్యానర్లు కట్టే సమయంలో ఇద్దరు ఫ్యాన్స్ విద్యుత్ షాక్‌తో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది.

నరసరావుపేటలో మొప్పువారిపాలెంలో సూర్య పుట్టిన రోజు సందర్భంగా నక్కా వెంకటేష్, పోలూరి సాయి అనే ఇద్దరు యువ ఫ్యాన్స్ ఫ్లేక్సీ కట్టడానికి చేసిన ప్రయత్నంలో కరెంట్ షాక్‌కు గురైయ్యారు. ఇక బాధిత కుటుంబాలకు సినీ ప్రియులు.. నెటిజన్స్ తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు.

ఇక సూర్య కంగువ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్‌లపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ఐదు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దిశా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా చేస్తోంది. ఇతర కీలకపాత్రల్లో యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ తదితరులు నటిస్తున్నారు. ఇక సూర్య ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సూర్య, వెట్రీ మారన్ దర్శకత్వంలో వడివాసల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. సూర్య ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ప్రకటించారు.. వనంగాన్ పేరుతో మొదలైన ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది. మరో కీలక పాత్ర కోసం తెలుగు హీరోయిన్ కృతి శెట్టిని తీసుకున్నారు. ఓ షెడ్యూల్ కూడా జరుపుకున్న ఆ సినిమా ఆగిపోయింది.

ఈ సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు చేర్పుల కారణంగా ఇటు సూర్యకు, అటు దర్శకుడు బాలాకు మధ్య భేదాప్రాయాలు రావడంతో సున్నితంగా సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. కథలో కొన్ని మార్పుల కారణంగా ఈ సినిమా ఇక ఏమాత్రం సూర్యకు సరిపోదని.. మరో హీరోతో ఈ సినిమా రానుందని ఈ సినిమా దర్శకుడు బాలా ప్రకటించారు. అయితే త్వరలోనే మంచి కథతో మరోసారి సూర్యతో పనిచేస్తానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. సూర్య గతంలో  (Bala) బాలా దర్శకత్వంలో శివ పుత్రుడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

సూర్య నటించిన మరో సినిమా సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దురా).. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్. గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది.

Creedit : https://telugu.news18.com/news/movies/surya-birthday-celebrations-two-young-fans-died-due-to-electric-shock-here-are-the-details-sr-1992300.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *