WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Pawan Kalyan: రీ రిలీజ్‌కు సిద్ధమైన పవన్ కళ్యాణ్ మరో బ్లాక్ బస్టర్ మూవీ.. ట్రైలర్ ఇదే.. రికార్డ్స్ బద్దలేనా?

Pawan KalyanTholi Prema Re Release | గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది. ఈ కోవలో ఇప్పటికే పలు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్.

Pawan Kalyan – Tholi Prema: ఒక్కో హీరో కెరీర్‌లో ఒక్కో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్‌ను స్టార్ హీరోగా మార్చేసిన సినిమా ‘తొలిప్రేమ’. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి .. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయికి చేర్చిన సినిమా ‘తొలిప్రేమ’. ఎపుడో పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాను ఇపుడు జూన్ 30న మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది. ఈ కోవలో ఇప్పటికే పలు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్.. జల్సా, ఖుషీ సిమాలు రీ రిలీజ్‌లో మంచి వసూళ్లనే సాధించాయి. ఈ నేపథ్యంలో ఇపుడు ‘తొలిప్రేమ’ సినిమాను 4K లో విడుల చేస్తున్నారు. అంతేకాదు దానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేసారు.

కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జీవిజీ రాజు నిర్మించారు. ఈ సినిమా విషయానికొస్తే.. అప్పటికే చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్.. వరస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్‌గానే ఆడినా.. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు పవన్ స్థాయిని పెంచేసాయి. అలాంటి సమయంలో కొత్త దర్శకుడు ఏ కరుణాకరణ్ చెప్పిన కథ నచ్చి తొలి ప్రేమ సినిమా చేసాడు పవర్ స్టార్.

మాస్ సినిమాలతో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న మెగాస్టార్ తమ్ముడు, కొత్త దర్శకడు కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడంటూ అందరూ పవన్ కల్యాణ్‌ను విమర్శించారు. అయితే కథను నమ్మి, కరుణాకరన్ మీద నమ్మకంతో ముందుకెళ్లాడు పవన్ కల్యాణ్. అంతకుముందు కమెడియన్ అలీ సరసన ‘గన్‌షాట్’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన కీర్తిరెడ్డిని ఫీమేల్ లీడ్‌గా తీసుకున్నారు. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ఈ సినిమాలో ‘గగనానికి ఉదయం ఒకటే…’ సాంగ్ కోసం సముద్రం ఒడ్డున ప్రత్యేకంగా తాజ్‌మహల్ సెట్ వేశారు. ఈ సెట్ కోసం భారీగా ఖర్చవ్వడంతో పవన్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని కూడా అంటారు. ఎన్నో కష్టాలు పడి సినిమాను పూర్తిచేశారు కరుణాకరన్ అండ్ కో. 1998, జూలై 24న ‘తొలిప్రేమ’ సినిమా విడుదలయ్యింది. మొదట స్లోగా మొదలైన కలెక్షన్స్… ఆ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకున్నాయి. ఏకంగా 21 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న ‘తొలిప్రేమ’ సినిమా… మూడు సెంటర్లలో నేరుగా 200 రోజులు ఆడింది. అంతేకాకుండా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య 70 ఎం.ఎం. థియేటర్లో 217 రోజులాడింది. అలాగే గుంటూరు లిబర్టీ థియేటర్లో 224 రోజులు, వరంగల్ రామ్- లక్ష్మణ్ థియేటర్లో 300 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. 1998 యేడాది విడుదలైన చిత్రాల్లో చూడాలని వుంది తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా  రెండో స్థానంలో నిలిచింది తొలిప్రేమ.

హీరోయిన్ కీర్తిరెడ్డి ఇంట్రడక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. పవన్ కల్యాణ్ వాడిన ఆర్‌ఎక్స్ 100 బైక్‌కు క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా కొల్లగొట్టిందీ చిత్రం. కరుణాకరన్‌కి ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ డిబెట్ మూవీ డైరెక్టర్ కేటగిరీల్లో నంది అవార్డులు వరించాయి. ఈ సినిమాను తర్వాత ‘మూజే కుచ్ కెహ్నా హై’ పేరుతో హిందీలోకి, ‘ప్రీత్సు తప్పేనిల్లా’ పేరుతో కన్నడలోకి రీమేక్ చేశారు. తమిళలో ‘ఆనంద మజాయి’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.

తెలుగమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్‌పై జివిజి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ హోదాను అందుకుంది. పవన్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా కూడా తొలిప్రేమ రేంజ్ మాత్రం సపరేట్. ముందుగా ఈ చిత్రాన్ని సుమంత్ చెబితే నో చెప్పాడు.  ఆ తర్వాత అప్పటికే ప్రేమదేశంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అబ్బాస్ కూడా ఈ కథను ఒద్దన్నారు. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఈ సినిమా కథ నచ్చేసి సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే  చేసేసాడు. అంతేకాదు ఈ సినిమా సక్సెస్‌తో స్టార్ హీరో అయిపోయాడు.

ఇవివి సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, భీమినేని లాంటి పేరున్న దర్శకులతో తొలి మూడు సినిమాలు చేసిన తర్వాత తనకు తానుగా సొంతంగా నిర్ణయించుకుని.. కొత్త దర్శకుడితో పవన్ చేసిన సినిమా తొలి ప్రేమ. 1998లో అప్పటికే సుస్వాగతం లాంటి బ్లాక్‌బస్టర్ అందుకున్న పవన్.. అదే ఏడాది జూలై 24న విడుదలైన తొలిప్రేమతో వచ్చాడు. అది క్లాసికల్ హిట్‌గా నిలిచింది. పాత్ బ్రేకింగ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో వసూలు చేసిన మొత్తం ఎంతో చూద్దాం..

అప్పటికే వరసగా రెండు విజయాలు రావడంతో ‘తొలిప్రేమ’ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. 23 ఏళ్ళ కిందే ఈ చిత్రాన్ని 4.27 కోట్లకు అమ్మారు. అప్పట్లో ఇది ఎక్కువ మొత్తమే. ఫుల్ రన్‌‌లో తొలి ప్రేమ 9 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. అంటే బయ్యర్లకు దాదాపు 4.50 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.

Credit : https://telugu.news18.com/news/movies/pawan-kalyan-tholi-prema-re-release-on-june-30-here-are-the-movie-records-ta-1921668.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *