WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Vishwak Sen: ఆహాలో వినూత్నమైన షో.. వినోదం పంచడానికి విశ్వక్ సేన్ సరికొత్త అవతారం

Aha OTT: ఓటీటీ మాధ్య‌మం ఆహా.. మ‌రో విల‌క్ష‌ణ‌మైన షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ షోతో వినోదం పంచడానికి విశ్వక్ సేన్ రెడీ అవుతున్నారు.

కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ సినిమాలు ఓకే చేస్తూ ముందుకెళ్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). నటనా పరంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో ఇప్పుడు ఓ వినూత్న అడుగేస్తున్నారు. యూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన విశ్వక్.. ఇప్పుడు ఆహా ఓటీటీ (Aha OTT) వేదికపై ఓ ప్రోగ్రాం చేసేందుకు రెడీ అయ్యారు. తెలుగు స్టార్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ఓటీటీ మాధ్య‌మంలోకి రంగ ప్ర‌వేశం చేయించిన ఆహా ఇప్పుడు విశ్వక్ సేన్ తో సరికొత్త ప్రయోగం చేస్తోంది.

బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో, స్పెష‌ల్ టాక్ షోస్‌, రియాలిటీ షోస్ ఇలా ప్ర‌తీ వారం తెలుగు ప్రేక్ష‌కుల ముంగిట స‌రికొత్త హంగామాను పుట్టించ‌టంలో తనదైన ముద్ర వేసుకున్న ఓటీటీ మాధ్య‌మం ఆహా.. మ‌రో విల‌క్ష‌ణ‌మైన షోని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఓ వైపు తిరుగులేని టాలెంట్‌, మ‌రో వైపు ఎన‌ర్జీతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన విశ్వ‌క్ సేన్ ఆహా ఆడియెన్స్‌ను త్వ‌ర‌లోనే అల‌రించ‌బోతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు విశ్వ‌క్ సేన్‌ను చూడ‌న‌టువంట స‌రికొత్త అవ‌తార్‌లో ఆహా ఆవిష్క‌రించ‌నుంది. ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైనింగ్ షో ని 15 ఎపిసోడ్స్‌ గా ఆహా సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. ఇటీవల ‘దాస్‌ కా దమ్కీ’తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌.. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా చేస్తున్నారు. కృష్ణచైతన్య దీనికి దర్శకత్వం వహించనున్నారు.

ఫ‌ల‌క్‌నుమా దాస్‌, హిట్‌, ఓరి దేవుడా, దాస్ కా ధ‌మ్కీ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ హీరోగా సత్తా చాటుతున్నారు విశ్వక్ సేన్. ఈ క్రమంలోనే ఆహా కోసం ధైర్యం చేసి ఓ ప్రోగ్రాం హోస్ట్ గా మారనుండటం హాట్ టాపిక్ అయింది.

Credit : https://telugu.news18.com/news/movies/vishwak-sen-to-make-his-ott-debut-on-aha-slb-1971512.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *