WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Ram Charan Rejected movies: ఆ విషయంలో రామ్ చరణ్ జడ్జిమెంట్ సూపర్.. రిజెక్ట్ చేసిన 6 చిత్రాల్లో 4 డిజాస్టర్స్..

Ram Charan Rejected movies: 2007లో చిరుత సినిమాతో అరంగేట్రం చేసాడు రామ్ చరణ్. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. చిరుత నుంచి ఆర్ఆర్ఆర్ టూ ఆచార్య మధ్యలో ఈయన కొన్ని సినిమాలకు.. కొందరు దర్శకులకు నో చెప్పాడు. ఈ 15 ఏళ్ల గ్యాప్‌లో చరణ్ వదిలేసిన సినిమాలు.. వాటి ఫలితాలు చూద్దాం..

Ram Charan Rejected Movies | 2007లో చిరుత సినిమాతో అరంగేట్రం చేసాడు రామ్ చరణ్. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత మగధీరతో చరిత్ర తిరగరాసాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తనదైన దారిలో దూసుకుపోతున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.

ఇదిలా ఉంటే చిరుత నుంచి ఆర్ఆర్ఆర్ టూ ఆచార్య మధ్యలో ఈయన కొన్ని సినిమాలకు.. కొందరు దర్శకులకు నో చెప్పాడు చరణ్. ఎక్కువగా మణిరత్నం, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులకు చరణ్ నో చెప్పాడు. వాళ్ల కథలు నచ్చినా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా వాటికి దూరంగా ఉన్నాడు రామ్ చరణ్. అలా ఈ  15 ఏళ్ల గ్యాప్‌లో చరణ్ వదిలేసిన సినిమాలు.. వాటి ఫలితాలు చూద్దాం..

 సూర్య సన్నాఫ్ కృష్ణన్: చిరుత సినిమా అలా విడుదలైందో లేదో అప్పుడే గౌతమ్ మీనన్ నుంచి రామ్ చరణ్‌కు ఆఫర్ వచ్చింది. అయితే అప్పటికే ఈయన మగధీర సినిమాకు కమిట్ కావడంతో వదిలేసుకున్నాడు. ఆ తర్వాత దాన్నే సూర్యతో చేసి హిట్ కొట్టాడు గౌతమ్ మీనన్.

ఎటో వెళ్లిపోయింది మనసు:  ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా కథను ముందు కూడా రామ్ చరణ్‌కు చెప్పాడు గౌతమ్. కానీ ఆరెంజ్ సినిమాతో అప్పుడే ఓ ఫ్లాప్ ఇచ్చాడు చరణ్. దాంతో క్లాస్ కథలు మనకు సెట్ అవ్వవని ఎటో వెళ్లిపోయింది మనసు కథను రిజెక్ట్ చేసాడు. దాన్ని రామ్ కూడా కాదనుకున్నాక నానితో చేసాడు గౌతమ్ మీనన్. ఫలితం తేడా కొట్టేసింది.

ఓకే బంగారం: మణిరత్నంతో సినిమా చేయాలని ప్రతీ హీరోకు ఉంటుంది. కానీ ఓకే బంగారం కథ నచ్చినా కూడా అప్పుడు ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో చేయలేకపోయాడు రామ్ చరణ్. ఈయన కాదనడంతో దుల్కర్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. తెలుగులోనూ విజయం సాధించింది ఓకే బంగారం మూవీ.

కృష్ణార్జున యుద్దం: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి రెండు హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ చరణ్‌కు కృష్ణార్జున యుద్ధం కథ చెప్పాడు చరణ్‌కు. కానీ అప్పటికే నాయక్‌లో ద్విపాత్రాభినయం చేయడం.. వెంటనే మరోసారి డబుల్ రోల్ అని కాదనుకున్నాడు. పైగా ఆ కంటెంట్ కూడా చరణ్‌కు ఎక్కలేదు. ఫలితం ఈ సినిమాతో నాని విజయ పరంపరకు బ్రేకులు పడ్డాయి.

నేల టిక్కెట్టు: కళ్యాణ్ కృష్ణ కురసాల మెగా కుటుంబానికి బాగా దగ్గర. పైగా అప్పటికే సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం హిట్స్ ఇచ్చాడు. అయినా కూడా ఈయన చెప్పిన నేల టిక్కెట్టు కథ చరణ్‌కు నచ్చలేదు. దాంతో నో చెప్పేసాడు. ఆ తర్వాత ఈ సినిమాను రవితేజతో తెరకెక్కించాడు. ఫలితం తేడా కొట్టేసింది.

ఏజెంట్ | ధృవ తర్వాత సురేందర్ రెడ్డి.. రామ్ చరణ్‌తో మరో సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. అప్పటికే వక్కంతం వంశీ ఇచ్చిన ‘ఏజెంట్’ మూవీ కథను చరణ్‌కు వినిపించాడు. చరణ్‌కు ఈ స్పై థ్రిల్లర్ చేయాలని ఉన్నా.. అప్పటికే ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు నో చెప్పాడు. ఫలితం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బొక్క బోర్లా పడింది.

అలా రామ్ చరణ్ నో చెప్పిన సినిమాల్లో ఓకే బంగారం, సూర్య సన్నాఫ్ కృష్ణణ్ సినిమాలు మాత్రమే విజయం సాధించి మిగిలిన నాలుగు చిత్రాలు ‘ఎటో వెళ్లిపోయింది మనసు, కృష్ణార్జున యుద్ధం, నేల టిక్కెట్, తాజాగా ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫట్ అనిపించాయి. దీంతో రామ్ చరణ్ సినిమాల జడ్జిమెంట్‌ ఎంత కరెక్టో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. తాజాగా ఏజెంట్ ఫలితంతో అది మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు.

Credit : https://telugu.news18.com/photogallery/movies/ram-charan-rejected-movies-including-akhil-agent-to-surya-son-of-krishnan-to-eto-vellipoyindi-manasu-here-are-the-movies-list-ta-1927012-page-9.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *