WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Prepaid Plans: బిగ్ షాక్.. ఈ సిమ్ కార్డు వాడే వారికి కంపెనీ ఝలక్!

Vi Plans | మొబైల్ ఫోన్ వాడే వారికి ఝలక్. తాజాగా ప్రముఖ టెలికం కంపెనీ తన యూజర్లకు షాకిచ్చింది. దీంతో చాలా మందిపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.

Recharge Plans | ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న వొడాఫోన్ ఐడియా (వీఐ) తన యూజర్లకు షాకిచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. పరోక్షంగా టారిఫ్ ధరలను పెంచింది. దీని వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. రెండు ప్రిపెయిడ్ ప్లాన్స్ (Prepaid Plans) వాలిడిటీ తగ్గిస్తూ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కస్టమర్లు తరచుగా ఈ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

నివేదికల ప్రకారం చూస్తే.. వొడాఫోన్ ఐడియా తొలిగా ముంబై సర్కిల్‌లో పరోక్షంగా టారిఫ్ ధరలను పెంచేసింది. ఇప్పుడు ఇదే విధానాన్ని గుజరాత్ సర్కిల్‌లో కూడా అమలులోకి తీసుకువచ్చింది. రూ. 99, రూ. 128 రీచార్జ్ ప్లాన్ల వాలిడిటీని కంపెనీ తగ్గించింది. రూ. 99 ప్లాన్ వాలిడిటీ 28 రోజుల నుంచి 15 రోజులకు తగ్గింది. అలాగే రూ. 128 ప్లాన్ వాలిడిటీ 28 రోజుల నుంచి 18 రోజులకు దిగి వచ్చింది. ఇదే నిర్ణయం రానున్న కాలంలో ఇతర సర్కిళ్లలో కూడా అమలు కావొచ్చు. కాగా కంపెనీ ఈ ప్లాన్స్ వాలిడిటీ తగ్గించినా కూడా ఇతర ప్రయోజనాలను మాత్రమే అలాగే కొనసాగించింది.

రూ. 99 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ ద్వారా 200 ఎంబీ డేటా వస్తుంది. రూ. 99 టాక్ టైమ్ లభిస్తుంది. అలాగే రూ. 128 ప్లాన్ విషయానికి వస్తే.. ఇందులో 10 లోకల్ ఆన్‌నెట్ నైట్ మినిట్స్ లభిస్తాయి. అన్ని లోకల్ నేషనల్ కాల్స్ సెకన్‌కు 2.5 పైసా పడుతుంది. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ మినిట్స్ ప్రయోజనం పొందొచ్చు. టారిప్ వాలిడిటీ మార్పుతో పాటుగా కంపెనా నాలుగు కొత్త రీచార్జ్ ప్లాన్స్ కూడా తీసుకువచ్చింది.

రూ. 198 ప్లాన్ తీసుకువచ్చింది. దీని వాలిడిటీ 30 రోజులు. రూ. 198 టాక్ టైమ్ లభిస్తుంది. 500 ఎంబీ డేటా పొందొచ్చు. రూ. 204 ప్లాన్ కూడా తెచ్చింది. ఈ ప్లాన్‌లో రూ. 204 టాక్‌టైమ్ వస్తుంది. 500 ఎంబీ డేటా లభిస్తుంది. కాల్స్‌కు సెకన్‌కు 2.5 పైసా పడుతుంది. ప్లాన్ వాలిడిటీ నెల. ఇంకా రూ. 224 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. 4 జీబీ డేటా వస్తుంది. చివరిగా రూ. 232 ప్లాన్ కూడా ఉంది. ఇందులో కూడా 4 జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. వాలిడిటీ 30 రోజులు.

Credit : https://telugu.news18.com/news/technology/vodafone-idea-reduced-validity-of-2-prepaid-plans-report-kmv-1941044.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *