WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Xiaomi 12 Pro: వారెవా.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.42,000 డిస్కౌంట్!

Smartphone Offer | మీరు కొత్త ఫోన్ కొనే వారికి తీపికబురు. భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కళ్లుచెదిరే డీల్ పొందొచ్చు. ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Phone Offer | స్మార్ట్‌ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ షావోమి పలు రకాల స్మార్ట్‌ఫోన్స్‌ను (Smartphones) మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది. వీటిల్లో షావోమి 12 ప్రో కూడా ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఏకంగా రూ. 40 వేలకు పైగా తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్‌పై (Mobiles) ఉన్న ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

షావోమి 12 ప్రో 5జీ ఫోన్‌ ఎంఆర్‌పీ రూ. 84,999గా ఉంది. దీన్ని మీరు ఇప్పుడు రూ. 44,999కు కొనొచ్చు. అంటే మీకు ఏకంగా 47 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే అదనంగా రూ. 2250 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు మీరు ఈ ఫోన్‌ను రూ. 42,750కే కొనొచ్చు. అంటే మీకు ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 42 వేల తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు.

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 37 వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఎంపిక చేసిన మోడళ్లపై అదనంగా మరో రూ.2 వేల తగ్గింపు కూడా వస్తుంది. ఇకపోతే మీరు తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 2161 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 2787 పడుతుంది.

ఇంకా ఏడాది పాటు టెన్యూర్ అయితే నెలకు రూ. 4 వేలు కట్టాలి. ఇంకా 9 నెలల టెన్యూర్‌పై నెలకు రూ. 5300 ఈఎంఐ కట్టాలి. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ కూడా మారుతుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.7 ఇంచుల స్క్రీన్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Credit : https://telugu.news18.com/news/technology/xiaomi-12-pro-5g-12-gb-phone-offer-in-flipkart-kmv-1942934.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *