WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Monsoon : వర్షంలో టీవీ సరిగా రావట్లేదా? ఈ సింపుల్ ట్రిక్‌తో సెట్ అయిపోతుంది

Monsoon : వర్షాకాలంలో టీవీ సిగ్నల్స్ చెడిపోవడం సర్వసాధారణం. మీ డిష్ యాంటెన్నా ఆరుబయట ఇన్‌స్టాల్ చేసినట్లయితే.. సిగ్నల్ నష్టాన్ని నివారించడానికి మీరు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

రుతుపవనాలు వచ్చేశాయియ. చాలా నగరాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. అలాంటి పరిస్థితిలో శాటిలైట్ టీవీల సిగ్నల్స్ అకస్మాత్తుగా రావడం మానేస్తుంటాయి. ఫలితంగా టీవీ సరిగా రాదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్య వస్తూ ఉంటే, సిగ్నల్‌ను సరిచేయడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

మొదటిది.. వర్షంలో శాటిలైట్ సిగ్నల్స్ ఎలా ప్రభావితమవుతాయో తెలుసుకోవడం ముఖ్యం. తుఫానులు, వర్షాల కారణంగా ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్స్ బలహీనంగా మారతాయి. ఎందుకంటే వర్షాలు, తుఫానుల వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు చెదిరిపోతాయి. అందుకే టీవీ సిగ్నల్స్ సరిగా రావు.

చాలా శాటిలైట్ టీవీలు క్యు-బ్యాండ్ సిగ్నల్స్‌పై పనిచేస్తాయి. క్యూ-బ్యాండ్ సిగ్నల్‌లు కే-బ్యాండ్ సిగ్నల్‌ల కంటే తక్కువగా వస్తాయి, ఇవి వర్షం కారణంగా చెదురుతాయి. కాబట్టి వాతావరణంలో ఆకస్మిక మార్పులు క్యు-బ్యాండ్ సిగ్నల్‌లను కూడా దూరం చేస్తాయి.

శాటిలైట్ సిగ్నల్‌ను సరిచేయడానికి ఉత్తమ మార్గం… నీరు, వర్షం పడే ప్రదేశం నుంచి మీ డిష్ యాంటెన్నాను తీసివేసి, పొడి ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేయడం. డాబాపైన అలాంటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ సెట్ చేసుకోండి.

నాన్‌స్టిక్ వంట స్ప్రేతో మీ శాటిలైట్ డిష్‌ను పిచికారీ (స్ప్రే) చేయండి. ఇది వర్షపు చుక్కలను డిష్‌కు అంటుకోకుండా చేస్తుంది. మీ ప్రాంతంలో ఎంత తరచుగా వర్షం పడుతుందనే దానిపై ఆధారపడి… మీరు కనీసం మూడు నెలలకు ఒకసారి డిష్‌ను పిచికారీ చేవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డిష్ ఇంటి గోడపై అమర్చి ఉంటే, మీరు డిష్ ముందు ఫైబర్ గ్లాస్ ముక్కను ఏర్పాటుచేయవచ్చు. ఫైబర్‌గ్లాస్ డిష్‌కు షీల్డ్‌గా పనిచేస్తుంది. అప్పుడు వర్షపు నీరు డిష్ సిగ్నల్‌ను దెబ్బతియ్యలేదు.

మీరు ఒక పొడవైన స్తంభంపై డిష్‌ను ఉంచినట్లయితే, భారీ వర్షం, గాలి దానిని దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు దానిని రిపేర్ చేయడానికి టెక్నికల్ నిపుణుడిని పిలవవలసి ఉంటుంది. మీరు మీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Credit : https://telugu.news18.com/photogallery/life-style/simple-tips-to-fix-smart-tv-signal-in-rainy-season-without-disruption-nk-1963810-page-7.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *