WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Phone Heating: ఫోన్ హీట్‌ అవుతోందా? దాన్ని ఎలా కూల్‌గా ఉంచాలో తెలుసుకోండి..

Phone Heating: ఫోన్‌ హీట్‌ కాకుండా ఎలా చూసుకోవాలి? ఫోన్‌ పర్ఫార్మెన్స్‌ ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకుందాం.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య, యావరేజ్‌గా ఫోన్‌ వినియోగించే సమయం రెండూ పెరిగాయి. ఫోన్‌ లేకపోతే ఆందోళన పడిపోయే వారు చాలా మందే ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్లు హీట్‌ అవ్వడం చూస్తుంటాం. ఎందరో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు.

అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణాలు తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఫోన్‌ హీట్‌ కాకుండా ఎలా చూసుకోవాలి? ఫోన్‌ పర్ఫార్మెన్స్‌ ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకుందాం.

ఫోన్ హీట్‌ అవ్వడానికి కారణాలు : పాత ఫోన్ అయితే బేసిక్‌ టాస్క్ లను కూడా ఎఫిషియంట్‌గా కంప్లీట్‌ చేయడానికి కష్టపడుతుంది. ఇది ఫోన్‌ హీట్‌ అయ్యే అవకాశాలను పెంచుతుంది.

సరిగ్గా పని చేయని ప్రాసెసర్ లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లు CPU రిసోర్సెస్‌ను వినియోగించి ఫోన్ హీట్‌ అయ్యేలా చేస్తాయి. గేమింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ వంటి రిసోర్స్-ఇంటెన్సివ్ యాప్‌లను రన్ చేయడం వల్ల ప్రాసెసర్, ఇతర కాంపోనెంట్‌లపై అధిక భారం పడుతుంది. ఈ సమయంలో ఫోన్‌ హీట్‌ జనరేట్‌ చేస్తుంది.

పనిచేయని లేదా క్షీణించిన బ్యాటరీ కూడా ఛార్జింగ్ లేదా డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఫోన్ సాధారణం కంటే ఎక్కువగా హీట్‌ అవ్వడానికి కారణం కావచ్చు.ఫోన్‌కి మంచి ఎయిర్‌ వెంటిలేషన్ లేకున్నా సమస్య వస్తుంది. ఉపయోగిస్తున్న ఫోన్ కేస్ వేడిని ట్రాప్ చేయవచ్చు. దీంతో వేడి బయటకు పోకపోవడం వల్ల ఫోన్‌ హీట్‌ అవుతుంది.

ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల కూడా హీట్‌ జనరట్‌ అవుతుంది, ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్‌లను ఉపయోగించినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఫోన్‌ ఛార్జింగ్‌లో పెట్టి డిమాండ్ ఉన్న యాప్‌లను యూజ్‌ చేసినప్పుడు కూడా ఫోన్‌ హీట్‌ అవుతుంది. తక్కువ-నాణ్యత గల ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల కూడా ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది.

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు లేదా ఫోన్‌పై నేరుగా సన్‌లైట్‌ పడితే ఫోన్‌ హీట్‌ అవుతుంది. ఫోన్‌ వేడిని సమర్థంగా విడుదల చేయలేదు. దీంతో ఫోన్‌ హీట్‌ అవుతుంది.

ఫోన్‌ హీట్‌ కాకుండా ఏం చేయాలి? : విపరీతమైన ఉష్ణోగ్రత మార్పులు ఫోన్‌ను దెబ్బతీస్తాయి. ఫోన్‌ హీట్‌ అయిందని రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్‌లో ఉంచకూడదు. ఫోన్‌ ఆఫ్‌ చేసి చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది.

కంపెనీ అందించిన ఛార్జర్‌లనే ఉపయోగించండి. ఎందుకంటే అవి ఫోన్ కంపాటిబిలిటీ కోసం టెస్ట్‌ చేసి ఉంటాయి కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు. వేడి వాతావరణంలో లేదా సన్‌లైట్‌ నేరుగా పడుతున్నప్పుడు ఫోన్‌ను వాడకూడదు. సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.

పర్ఫార్మెన్స్‌ ఆప్టిమైజ్ చేయడానికి, హీట్‌ జనరేట్‌ కావడానికి కారణమయ్యే బగ్‌లను తొలగించేందుకు ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉంచండి. ఫోన్ తరచుగా హీట్‌ అవుతుంటే, మ్యానుఫ్యాక్చరర్స్‌ రిటైల్ షాప్‌లో టెస్ట్ చేయించండి. కొన్నిసార్లు ఇంటర్నల్‌ సమస్యల వల్ల ఫోన్‌ హీట్‌ అవుతుండవచ్చు.

ఎక్కువ కాలం పాటు డిమాండింగ్‌ యాప్‌లను యూజ్‌ చేయకూడదు. ఫోన్ కూల్‌ అవ్వడానికి ఇంటెన్సివ్ టాస్క్‌ల మధ్య కాస్త విరామం ఇవ్వండి. అలాగే ఫోన్ వాడనప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేయండి.

Credit : https://telugu.news18.com/photogallery/technology/quick-guide-on-why-your-phone-feels-hot-and-how-to-keep-your-phone-cool-and-fix-heating-issues-gh-srd-1986586-page-11.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *