WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Baby Movie : పదో రోజు బేబి ఆల్ టైమ్ రికార్డ్.. ఊచకొత అంటే ఇలా ఉంటుంది..

Baby Movie : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబి (Baby). ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

Anand Devarakonda | Baby : యువ నటుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరో కీలకపాత్రలో నటించారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు

ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలించాయి. ఇలా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 14న గ్రాండ్‌గా విడుదల అయింది. అంతేకాదు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ నటనతో అదరగొట్టారు. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. స్కూల్ లో చిగురించిన ప్రేమ, ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. కాలేజీకి వెళ్లాక ఎలా మారుతుందనే సన్నివేశాలతో సినిమాను అల్లుకున్నారు. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలోను అదరగొడుతోంది

10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, ఫస్ట్ వీక్‌లో దాదాపు రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వావ్ అనిపించింది. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవడంతో రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్, రవితేజ, సుకుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు టీంమ్‌‌ను అభినందింస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. 10వ రోజు బేబి ఇరగదీసింది. ఏకంగా మీడియం రేంజ్ మూవీస్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది. ఈ సినిమా 10వ రోజు 3.40 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్‌ అన్ని రికార్డ్‌లను బద్దలు కొట్టి టాప్ స్థానానికి వెళ్లింది. దీని కంటే ముందు వరకు ఉప్పెన మూవీ 2.61 కోట్లతో ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది బేబి.

బాక్సాఫీస్ దగ్గర 60 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసిన ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ విషయంలో ఇప్పటికే చాలా రూమర్స్ రాగా.. లేటెస్ట్‌గా ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో  ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా విజయవంతంగా మొదటి వీక్‌ను పూర్తి చేసుకుని రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో ఈ సినిమా OTT రిలీజ్‌ను కొన్ని రోజులు వాయిదా వేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. దీంతో ఈ సినిమా ఆహాలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకానుంది

ఇక పది రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఏపీ తెలంగాణలో 27.85 కోట్ల షేర్ వచ్చింది. 51.10 గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 31.71 కోట్ల షేర్ రాగా.. 60.40 గ్రాస్‌ను సాధించి వావ్ అనిపించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ సాధించి.. ఏకంగా 23.71 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం చేసుకున్ని బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైష్ణవి (వైష్ణవి చైతన్య) తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను 10 క్లాస్ నుంచే ప్రేమిస్తూ ఉంటోంది. మొదట వైష్ణవి ప్రేమించిన తర్వాత ఆనంద్ కూడా వైష్ణవి ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో ఆనంద్ టెన్త్ ఫెయిలై ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. మరోవైపు వైష్ణవి ఇంజనీరింగ్‌లో జాయిన్ అవుతోంది. అక్కడ వైష్ణవికి విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయమవుతాడు. ఈ క్రమంలో వీళ్ల జీవితంలో జరిగిన పరిణామాలు ఏమిటనేది బేబి మూవీ ప్రధాన స్టోరీ. ప్రాక్టికల్‌గా బయట జరిగిన.. జరగుతున్న వాటినే సినిమాలో చూపించాడు దర్శకుడు

మధ్య తరగతి అమ్మాయిలు ఇతరులు ఇచ్చే విలువైన బహుమతులకు ఆశపడటం. ఎలా తమ జీవితాలను నాశనం చేసుకోవడం.. మరోవైపు హై క్లాస్ అమ్మాయిలు కూడా ఎలా చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారనేది ఈ సినిమాలో చర్చించాడు. మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అనే కాన్సెప్ట్‌ను తెరపై చూపించాడు

ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన వైష్ణవి.. తన పాత్రలో ఒదిగిపోయింది. విరాజ్ అశ్విన్ కూడా ఉన్నంతలో పర్వాలేదనపించాడు. ఇతర పాత్రల్లో నాగబాబు, లిరిష, వైవా హర్ష తదితరులు నటించారు

Credit : https://telugu.news18.com/photogallery/movies/anand-deverakonda-vaishnavi-chaitanya-viraj-ashwin-baby-movie-created-all-time-record-on-tenth-day-here-are-the-details-sr-1994248-page-9.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *