WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

వర్షాకాలంలో గాడ్జెట్స్ తడుస్తున్నాయా.. ఈ చిట్కాలతో డ్రై చెయ్యండి.. హెయిర్ డ్రై వద్దు!

Monsoon Tips : వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు వర్షం పడితే… ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉంది. అందుకే గాడ్జెట్‌లను నీటి నుంచి ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా కొన్ని రోజులపాటూ భారీ వర్ష సూచన ఉంది. ఈ వారమంతా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిసింది. అందువల్ల ఈ సీజన్‌లో మీరు మీ గాడ్జెట్‌లను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు ఇతర గాడ్జెట్‌లను నీటి డ్యామేజ్ నుంచి రక్షించడానికీ, అవి తడిస్తే ఏం చెయ్యాలి అనే చిట్కాలను తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్‌లు వాటర్‌ప్రూఫ్ కాదు. మీరు వర్షాకాలంలో బయటకు వెళితే, మీ గాడ్జెట్‌లను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో కప్పి ఉంచండి. తద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లు వర్షంలో సురక్షితంగా ఉంటాయి.

వర్షాకాలంలో తడిసిన తర్వాత వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లు అతిగా తడిస్తే… వాటిలోకి కూడా నీరు వెళ్లే ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వాటిలో ఉంచిన గ్యాడ్జెట్‌లలోకి నీరు వెళ్లి అవి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే తేమను బాగా పీల్చుకునే సిలికా జెల్ పౌచ్‌లను బ్యాగ్‌లో ఎప్పుడూ ఉంచండి.

చాలా Tws ఇయర్‌బడ్‌లు IP రేటింగ్‌తో వస్తాయి, కానీ వర్షంలో తడిసిన తర్వాత అవి సరిగ్గా పనిచేయవు. అందుకే ఇయర్‌బడ్‌లు నీటిలో తడవకుండా కాపాడుకోవాలి. మరోవైపు, మీ ఇయర్‌బడ్‌లు IP67 లేదా IP68 రేటింగ్‌లో ఉంటే, మీరు వాటిని వర్షంలో కూడా ఉపయోగించవచ్చు.

గాడ్జెట్ తడిగా ఉంటే… మీరు దానిని హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టవద్దు. ఎందుకంటే, డ్రైయర్ గాలి ఉష్ణోగ్రత మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను లోపలివైపు దెబ్బతీస్తుంది. వాటిని మెత్తని పొడి గుడ్డతో తుడిచి.. పొడి గాలి వచ్చే ప్రదేశంలో లేదా, ఫ్యాన్ కింద పూర్తిగా ఆరేవరకూ ఉంచండి.

Credit : https://telugu.news18.com/photogallery/life-style/monsoon-tips-easy-ways-to-keep-electric-gadgets-safe-in-rain-do-not-use-hair-dryer-nk-1978578.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *