WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

సైబర్ క్రైమ్ కు చెక్ పెట్టేలా.. #CyberSafeIndia కోసం అందుబాటులోకి HackStop.. ఎలా పని చేస్తుందంటే?

సైబర్ మోసాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఇద్దరు మహిళా సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు ముందుకు కదిలారు. సైబర్-సురక్షిత భారతదేశానికి భరోసా కల్పించడంతో పాటు సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఒక వినూత్న సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ “HackStop“ను పరిచయం చేస్తున్నారు.

ప్రస్తుతం దేశానికి పెను సవాలు విసురుతున్న సమస్య.. సైబర్ క్రైమ్ (Cyber Crime). ప్రభుత్వాలు, పోలీసులు, నిపుణులు ఎంతగా హెచ్చరిస్తున్నా, అవగాహన కల్పిస్తూ ఉన్నా సైబర్ క్రైమ్ ఘటనలు మాత్రం ఆగడం లేదు. కేటుగాళ్ల కొత్త కొత్త ట్రిక్స్ తో అనేక మంది అమాయకులు సైబర్ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. అయితే.. ఈ మోసాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఇద్దరు మహిళా సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు ముందుకు కదిలారు. సైబర్-సురక్షిత భారతదేశానికి భరోసా కల్పించడంతో పాటు సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఒక వినూత్న సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ “HackStop”ను పరిచయం చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులైనప్రణతి, అనూష ఇద్దరూ “హాక్‌స్టాప్”ను అభివృద్ధి చేశారు.

‘హ్యాక్ స్టాప్’ అనేది కేవలం సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్, ఫైర్ వాల్ మాత్రమే కాదు. ఇది వ్యక్తులు, సంస్థలను సైబర్ దాడుల నుండి సమర్థవంతంగా రక్షించుకోవడానికి రూపొందించబడిన సమగ్ర అవగాహన ఉత్పత్తి అని వారు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ల మిశ్రమంగా దీనిని తీర్చిదిద్దారు. సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే కాకుండా.. ఇది అందరికి అందుబాటులో ఉండడం విశేషం.

“సైబర్ దాడులు, మోసాల నుంచి ప్రజలను రక్షించడమే కాకుండా, ఈ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి కావాల్సిన సాధనాలను వారికి అందించే పరిష్కారాన్ని మేము రూపొందించాలనుకున్నాం.” అని హ్యాక్ స్టాప్ రూపకర్తలు చెబుతున్నారు.

ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్ ట్రైనింగ్ మాడ్యూల్స్, రియల్ లైఫ్ సిములేషన్స్ ద్వారా HackStop వినియోగదారులకు సరైన అవగాహన కల్పించనుంది. #CyberSafeIndia ని ప్రోత్సహించే లక్ష్యంతో.. సైబర్ దాడులను, మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వ్యక్తులను, సంస్థలను సన్నద్ధం చేస్తుంది. డిజిటల్ గా కావాల్సిన రక్షణను ఇవ్వడమే కాకుండా.. సైబర్-దాడుల పట్ల అప్రమత్తంగా ఉంచుతుంది. సమాజం మొత్తాన్ని సైబర్ దాడుల నుంచి కాపాడడమే తమ లక్ష్యమని రూపకర్తలు చెబుతున్నారు. రెడ్‌సెక్‌ఆప్స్ సైబర్‌సెక్యూరిటీ ‘హ్యాక్ స్టాప్’ ను ఆగ‌స్టు 15న‌ ఆవిష్కరించనుంది.

Credit : https://telugu.news18.com/news/technology/hackstop-designed-for-cyber-safe-india-will-be-launched-on-august-15-here-details-ns-1989874.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *