WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Tomatoes on Paytm: పేటీఎంలో టమాటలు… కిలో రూ.70 మాత్రమే… ఒకరికి రెండు కిలోలు

Tomatoes on Paytm | టమాట ధరలు దిగిరావట్లేదు. ఇంకా సెంచరీ పైనే టమాట ధర పలుకుతోంది. చాలాచోట్ల కిలో టమాట రూ.100 పైనే ఉంది. పేటీఎంలో టమాటలు అందుబాటులోకి వచ్చాయి. కిలో రూ.70 మాత్రమే. ఒకరు రెండు కిలోలు కొనొచ్చు.

ప్రజలపై టమాట ధరల (Tomato Prices) భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల పంట రాకపోవడం, భారీ వర్షాలతో పండిన పంటను రవాణా చేసే వీలు లేకపోవడం లాంటి కారణాలతో టమాట ధరలు పెరిగాయి. ఇంకా ధరలు దిగిరావట్లేదు

కొన్ని ప్రాంతాల్లో కిలో టమాట ధర రూ.250 చేరుకుంది. దీంతో కొద్ది రోజుల క్రితమే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం దేశంలో టమాట ధరలు తక్కువగా ఉన్న మండీల నుంచి భారీగా టమాటల్ని సేకరించింది. వీటిని ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకే అమ్ముతోంది.

నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ (NCCF), నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (NAFED) దేశంలో పలు మండీల నుంచి పెద్దమొత్తంలో టమాటల్ని సేకరించాయి. వాటిని మొదట కిలో రూ.90 చొప్పున, ఆ తర్వాత కిలో రూ.80 చొప్పున అమ్మాయి. గత నాలుగు రోజులుగా కిలో రూ.70 చొప్పున సబ్సిడీ ధరకే టమాటలు అమ్ముతున్నాయి.

నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ (NCCF), నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (NAFED) దేశంలో పలు మండీల నుంచి పెద్దమొత్తంలో టమాటల్ని సేకరించాయి. వాటిని మొదట కిలో రూ.90 చొప్పున, ఆ తర్వాత కిలో రూ.80 చొప్పున అమ్మాయి. గత నాలుగు రోజులుగా కిలో రూ.70 చొప్పున సబ్సిడీ ధరకే టమాటలు అమ్ముతున్నాయి.

ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని ప్రజలు ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో టమాటలు ఆర్డర్ చేయొచ్చు. ఒకరు రెండు కిలోల టమాటలు ఆర్డర్ చేయొచ్చు. పేటీఎం ఉచితంగా డెలివరీ చేస్తుంది. అయితే ఒక కస్టమర్ వారానికి రెండు కిలోలు మాత్రమే ఆర్డర్ చేసే అవకాశం ఉంది. మిగతా కస్టమర్లకు కూడా టమాటలు అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం

ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో టమాటలు ఆర్డర్ చేసేందుకు ముందుగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. పేటీఎం, మ్యాజిక్‌పిన్, మైస్టోర్, పిన్‌కోడ్ ఆప్షన్స్‌లో ఒకదానిపై క్లిక్ చేయాలి. సదరు సంస్థకు చెందిన యాప్ ఓపెన్ అవుతుంది. ఫుడ్ పేజీలో Tomatoes from NCCF పైన క్లిక్ చేయాలి. కేవలం రూ.140 చెల్లించి రెండు కిలోల టమాటలు ఆర్డర్ చేయొచ్చు

పేమెంట్ పూర్తి చేసి ఆర్డర్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆర్డర్ చేసినవారికి ఇంటికే టమాటలు డెలివరీ అవుతాయి. ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్ ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో అందుబాటులో ఉన్నా ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో మాత్రమే తక్కువ ధరకు టమాటలు అందుబాటులో ఉన్నాయి

Credit : https://telugu.news18.com/photogallery/business/ondc-and-paytm-selling-tomatoes-online-just-for-rs-70-per-kg-know-how-to-order-cheaper-tomatoes-ss-1997042-page-7.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *